బెర్లిన్, జూన్ 2: పిల్లలకు బొమ్మలంటే ఇష్టముంటుంది… విమానం బొమ్మలంటే చాలా ఇష్టపడుతుంటారు.. కానీ ఈ యువతికి మాత్రం బోయింగ్ 737 విమానం అంటే చాలా ఇష్టమట. ఎంత ఇష్టమంటే ఏకంగా ఆ విమానాన్ని పెండ్లి చేసుకోవాలన్నంత ఇష్టమట. జర్మనీలోని డార్ట్మండ్ ప్రాంతానికి చెందిన సారా రోడో అనే 23 ఏండ్ల అమ్మాయి బోయింగ్ 737 విమానంతో ప్రేమలో పడిందట. ఆమె ఇంట్లో దీనిలాగే ఉన్న 50 బొమ్మలు ఉన్నాయట. ఆ విమానాన్ని ముద్దుగా ‘బోయింగ్ డికీ’ అని పిలుచుకుంటుందట. అయితే ఇలాంటి పెండ్లిళ్లు జర్మనీలో చట్ట విరుద్ధం.