ఫ్లాయిడ్ హంతకుడికి 22.5 ఏండ్ల జైలు

మినియా పోలీస్: నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను అత్యంత దారుణంగా హత్య చేసిన శ్వేతజాతి పోలీసు అధికారి డెరెక్ చావిన్‌కు ఎట్టకేలకు అమెరికా కోర్టు శిక్ష విధించింది. 22.5 ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ శనివారం తీర్పు చెప్పింది. నల్లజాతీయులను చంపిన కేసుల్లో అమెరికా పోలీసు అధికారికి ఇంత సుదీర్ఘకాలం జైలు శిక్ష పడటం ఆ దేశంలో అరుదైన విషయం. అయితే, ఈ తీర్పుపై ఫ్లాయిడ్ కుటుంబసభ్యులతోపాటు పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గరిష్ఠ శిక్ష అయిన 40 ఏండ్ల జైలు విధించాలని వారు న్యాయమూర్తిని కోరారు. డెరెక్‌కు 22.5 ఏండ్ల జైలుశిక్ష విధించినప్పటికీ.. జైలులో ‘సత్ప్రవర్తన’ కలిగి ఉంటే 2/3 వంతు శిక్షాకాలాన్ని (15 ఏండ్లు) పూర్తిచేసుకొని బయటపడే అవకాశం ఉంది. కాబట్టి, డెరెక్ నేరానికి ఇది ఎంతమాత్రం తగిన శిక్ష కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతేడాది ఫ్లాయిడ్ మెడపై డెరెక్ మోకాలిని తొక్కిపెట్టడంతో ఊపిరాడక అతడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

