జెనీవా: అత్యంత వేడిమి సంవత్సరంగా 2023 రికార్డులకెక్కింది. అయితే దానిని మించి ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని, ఎలినినో కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతుందని ఐక్యరాజ్య సమితి శుక్రవారం హెచ్చరించింది. ఉద్గారాల నివారణ చర్యలు పెద్దయెత్తున చేపట్టాలని కోరింది. ఎలినినో కారణంగా ఈ ఏడాది కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేసింది.