Wild fire | స్పెయిన్ అడవుల్లో కార్చిచ్చు.. బుగ్గిపాలైన 3 వేల భవనాలు.. రంగంలోకి 10 హెలికాప్టర్లు
Wild fire | స్పెయిన్ దేశంలోని కెనరీ దీవుల్లోగల అడవుల్లో కార్చిచ్చు కలకలం రేపుతోంది. అగ్నికీలలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో అధికారులు అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.
బార్సిలోనా: స్పెయిన్ దేశంలోని కెనరీ దీవుల్లోగల అడవుల్లో కార్చిచ్చు కలకలం రేపుతోంది. అగ్నికీలలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో అధికారులు అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటివరకు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొందరు తమ నివాసాలను వీడేందుకు నిరాకరిస్తుండటంతో బలవంతంగా తరలిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ కార్చిచ్చు కారణంగా 11 వేల ఎకరాల అటవీ ప్రాంతం తగులబడిపోయింది. వాటర్ డ్రాపింగ్ ప్లేన్లు, 10 హెలిక్యాప్టర్ల సాయంతో అధికారులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కార్చిర్చు పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. విస్తరిస్తున్న అగ్ని కీలలు ఇప్పటికే దాదాపు 3000 భవనాలను బుగ్గి చేశాయి.
కెనరీ దీవుల్లోని లా పాల్మా కొండపైన ఈ కార్చిచ్చు మొదలైంది. అక్కడ ఓ అగ్నిపర్వతం బద్దలవడమే ఈ కార్చిచ్చుకు కారణమైంది. ఈ కార్చిచ్చు వల్ల ఇప్పటి వరకు ఎవరూ ప్రాణాలు కోల్పోక పోయినా అరటి తోటలతోపాటు ఇతర వ్యవసాయ పంటలు తగులబడిపోయాయి. కార్చిచ్చును అణచడం కోసం మరిన్ని ప్లేన్లు, హెలిక్యాప్టర్లను రంగంలోకి దించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

