చైనాలో విషాదం.. మారథాన్లో పాల్గొన్న 20 మంది రన్నర్లు మృతి
20 మంది రన్నర్లు మృతి | ప్రతికూల వాతావరణం కారణంగా మారథాన్లో పాల్గొన్న 20 మంది రన్నర్లు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గల్లంతయ్యారు.

బీజింగ్ : ప్రతికూల వాతావరణం కారణంగా మారథాన్లో పాల్గొన్న 20 మంది రన్నర్లు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గల్లంతయ్యారు. చైనాలోని గన్సు ప్రావిన్స్కు వాయవ్యంగా ఉన్న బైయిన్ సిటీలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బైయిన్ నగరానికి సమీపంలోని యల్లో రివర్ స్టోన్ అటవీ ప్రాంతంలో కొండలపై 100 కిలోమీటర్ల పర్వత మారథాన్ నిర్వహించారు. ఇందులో సుమారు 172 మందికిపైగా పాల్గొన్నారు.
పరుగు కొనసాగుతుండగా 20 నుంచి 31 కిలోమీటర్ల మధ్య మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారి వడగళ్లు, మంచు వర్షం, భీకర చలిగాలులు సంభవించడంతో ఉష్ణోగ్రత్త ఒక్కసారిగా పడిపోయి 20 మంది ప్రాణాలు కోయినట్లు బైయిన్ నగర మేయర్ జాంగ్ జిచెన్ తెలిపారు. అప్రమత్తమైన నిర్వాహకులు 3 గంటల సమయంలో మారథాన్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి వెంటనే స్థానికుల సాయంతో సహాయక బృందాలను రంగంలోకి దించాయి.
గాయపడిన 8 మంది రన్నర్లను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించడంతో మారథాన్లో పాల్గొన్న పలువురు రన్నర్లు హైపోథెర్మియా (అల్పఉష్ణస్థితి)తో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. మారథాన్లో పాల్గొన్న వారిలో 151 మంది సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

