Canadaలో ఒమిక్రాన్.. ఇద్దరికి పాజిటివ్
Omicron | ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కెనడాలో (Canada) ప్రత్యక్షమయింది. దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్ (Omicron) కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.

ఒట్టావా: ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కెనడాలో (Canada) ప్రత్యక్షమయింది. దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్ (Omicron) కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. నైజీరియా నుంచి ఒంటారియోకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో సరికొత్త వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచామని, ఈ మధ్యకాలంలో వారు కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని ఆరోగ్యశాఖ మంత్రి జీన్ వెస్ తెలిపారు. మానిటరింగ్, టెస్టింగ్ ప్రక్రియ కొనసాగుతున్నదని, దేశంలో మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ సరికొత్త కరోనా వేరియంట్ పట్ల ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. కెనడా కూడా ఆఫ్రికాలోని ఏడు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది. అయితే ఈ జాబితాలో నైజీరియా లేకపోవడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

