కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లో ఇవాళ బాంబు పేలుళ్లు జరిగాయి. మిలిటరీ హాస్పిటల్ వద్ద పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రదేశంలో కాల్పులు ఘటన కూడా జరిగినట్లు భావిస్తున్నారు. కాబూల్లో రెండు పేలుళ్లు జరిగినట్లు తాలిబన్ మీడియా ప్రతినిధి ద్రువీకరించారు. మిలిటరీ హాస్పిటల్ గేటు వద్ద తొలి పేలుడు సంభవించింది. రెండవ పేలుడు హాస్పిటల్ సమీపంలో జరిగింది.