ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఇంటికి కన్నమేసిన దొంగలు.. 19 ఫ్రెచ్ బుల్డాగ్స్ను ఎత్తుకెళ్లారు. శునకాలే కదా అనుకుంటున్నారా.. వాటి విలువెంతో తెలుసా? తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. అక్షరాలా లక్ష అమెరికన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.81 లక్షల 49 వేల 550 అన్నమాట. అందుకేనేమో ఇంట్లో దూరిన దొంగలు ఇతర వస్తువులేవీ టచ్ కూడా చేయకుండా ఆ బుల్డాగ్స్నే దొంగిలించారు.
శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఫ్లోరిడాని ఎవరూ లేని ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. బెడ్రూమ్ కిటికీ అద్దాలను పగులగొట్టిన దుండగులు.. అందులో ఉన్న 19 ఫ్రెంచ్ బుల్డాగ్స్ను అపహరించారు. ఎంచక్కా కారులో వేసుకుని అక్కడి నుంచి చెక్కేశారు. ఈ వ్యవహారమంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ఫేస్బుక్స్ పోస్టు ద్వారా ఆ దృష్యాలను షేర్ చేశారు. దొంగలు ప్రయాణిస్తు కారు బంపర్ డ్యామేజ్ అయిందని అందులో పేర్కొన్నారు. కాగా, అమెరికాలో అత్యంత ఖరీదైన కుక్కల్లో ఫ్రెంచ్ బుల్డాగ్ జాతి ఒకటి. ఈ జాతికి సంబంధించిన కుక్క ఒక్కొక్కటి 1500 నుంచి 4500 అమెరికన్ డాలర్లు ఉంటుంది.