అతిపెద్ద బర్మీస్ పైథాన్ (కొండ చిలువ)ను యూఎస్ పరిశోధకులు స్వాధీనం చేసుకున్నారు. ఇది 18 అడుగుల పొడవు.. 98 కిలోల బరువుంది. ఇది ఫ్లోరిడా రాష్ట్రంలో ఇప్పటివరకూ కనిపించిన అతిపెద్ద కొండచిలువ అని పరిశోధకులు తేల్చారు. సౌత్-వెస్ట్ ఫ్లోరిడా కన్జర్వెన్సీ ప్రకారం ఈ కొండచిలువ లోపల 122 గుడ్లున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ కొండచిలువ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
చనిపోయిన ఆ కొండచిలువకు పరిశోధకులు శవపరీక్ష చేశారు. అది చివరగా జింకను తిన్నట్లు కనుగొన్నారు. దాని కడుపులో అత్యధికంగా 122 గుడ్లున్నట్లు గుర్తించారు. బర్మీస్ పైథాన్స్ ప్రపంచంలోని అతిపెద్ద పాములలో ఒకటి. ఇవి ఆగ్నేయాసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) రెడ్ లిస్ట్‌లో హాని కలిగించే జాబితాలో ఉన్నాయి.