రష్యాలోని కాస్పియన్ సముద్ర తీరంలో దాదాపు 1,700 సీల్స్ విగతజీవులుగా కనిపించాయి. ఘటనపై రష్యా అధికారులు స్పందించారు.
కొన్ని వారాల క్రితం ఇవి మృతి చెంది ఉండవచ్చని తెలిపారు. ప్రస్తుతానికి సీల్స్ మృతికి కారణాలు తెలియరాలేదని, ప్రకృతి విపత్తుల వల్ల మరణించాయని ప్రాథమికంగా భావిస్తున్నట్టు వెల్లడించారు.