Indonesia | ప్రభుత్వ చమురు డిపోలో పేలుడు.. ఇద్దరు చిన్నారులుసహా 16 మంది దుర్మరణం
ఇండోనేషియా రాజధాని జకార్తలో (Jakarta) భారీ అగ్నిప్రమాదం (Massive blaze) జరిగింది. జకార్తాలో ఉన్న ఓ చమురు డిపోలో (Fuel storage depot) పేలుడు సంభవించింది. దీంతో 16 మంది దుర్మరణం చెందారు.
Indonesia | ఇండోనేషియా రాజధాని జకార్తలో (Jakarta) భారీ అగ్నిప్రమాదం (Massive blaze) జరిగింది. జకార్తాలో ఉన్న ఓ చమురు డిపోలో (Fuel storage depot) పేలుడు సంభవించింది. దీంతో 16 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 50 మందికిపైగా గాయపడ్డారు. ఉత్తర జకార్తాలోని తనహ్ మేరా సమీపంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పెర్టమినా (Pertamina) ఆయిల్ డిపో ఉన్నది. అందులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో అధికారులు నివాస ప్రాంతాల్లో ఉండే వేలాది మంది ప్రజలను ఖాళీ చేయించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 37 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 180 మంది ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా, శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతోపాటు పిడులు పడటంతో మంటలు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత అది పేలుళ్లకు కారణమైందని చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు.

కాగా, ఇదే చమురు డిపోలో 2009లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 ఇండ్లు కాలి బూడిదయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక 2021లో పశ్చిమ జావాలోని బాలొన్గాన్ (Balongan) రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

