అమెరికా జనాభాలో 15% విదేశీయులే
అమెరికాలో చట్టబద్ధమైన, చట్ట విరుద్ధమైన విదేశీ జనాభా అక్టోబర్ 2023లో 49.5 మిలియన్లుగా నమోదైంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ 2021లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత రికార్డు స్థాయిలో 45 లక్షల విదేశీ జనాభా పెరిగినట్టు వాషింగ్టన్ కేంద్రంగా నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది.
న్యూయార్క్, డిసెంబర్ 1: అమెరికాలో చట్టబద్ధమైన, చట్ట విరుద్ధమైన విదేశీ జనాభా అక్టోబర్ 2023లో 49.5 మిలియన్లుగా నమోదైంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ 2021లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత రికార్డు స్థాయిలో 45 లక్షల విదేశీ జనాభా పెరిగినట్టు వాషింగ్టన్ కేంద్రంగా నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది. అలాగే అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంతగా మొత్తం దేశ జనాభాలో 15 శాతం విదేశీయులు, వలస వచ్చిన వారేనని 2023 అక్టోబర్ వరకు నిర్వహించిన ఈ సర్వే తెలియజేసింది.
ఇప్పటికే దేశంలోకి వస్తున్న అక్రమ వలసదారులపై చర్చ జరుగుతున్న క్రమంలో దేశంలో ఉన్న 25 రాష్ర్టాల జనాభా కన్నా 45 లక్షల వలసదారుల పెరుగుదల ఆందోళన కలిగించే అంశమని ఆ సర్వే పేర్కొంది. ఇలా వలస వచ్చిన వారిలో సౌత్ అమెరికా నుంచి 28 శాతం, సెంట్రల్ అమెరికా నుంచి 25 శాతం, సబ్-సహరన్ ఆఫ్రికా నుంచి 21 శాతం, కరేబియన్ నుంచి 20 శాతం, మిడిల్ ఈస్ట్ నుంచి 14 శాతం మంది ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

