డ్రాగన్ మ్యాన్!

- కొత్త మానవ జాతి గుర్తింపు
వాషింగ్టన్: శాస్త్రవేత్తలు కొత్త మానవ జాతిని కనుగొన్నారు. ఈశాన్య చైనాలో దొరికిన ఓ కపాలంపై పరిశోధనలు నిర్వహించగా ఈ కొత్త జాతి బయటపడినట్టు ప్రకటించారు. ఈ జాతికి హోమో లాంగీ అని పేరు పెట్టారు. హోమో లాంగీ అంటే డ్రాగన్ రివర్ అని అర్థం. అందుకే ఈ జాతిని డ్రాగన్ మ్యాన్ అని కూడా పిలుస్తున్నారు. ప్రస్తుత మానవ జాతి హోమో సెపియన్స్కు ఇది అతి దగ్గరి జాతి అని శాస్త్రవేత్తలు తెలిపారు. మానవ జాతి పరిణామ క్రమంలో ఇప్పటి వరకు హోమో సెపియన్స్కు నియాన్డెర్తాల్ దగ్గరి జాతి అని భావించారు. చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని హార్బిన్లో 1930లో ఓ కపాలాన్ని కనుగొన్నారు. జపాన్ సైన్యం నుంచి కాపాడటానికి అప్పుడు దాన్ని ఓ బావిలో దాచిపెట్టారు. 85 ఏండ్లు అది బావిలోనే ఉంది. 2018లో బావిని తవ్వి హెబీ జీఈవో వర్సిటీ ప్రొఫెసర్ జీ కియాంగ్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఆ కపాలంపై పరిశోధనలు సాగుతున్నాయి. ‘హోమోసెపియన్స్కు నియాన్డెర్తాల్ జాతి కంటే హార్బిన్లో దొరికిన కపాలానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి’ లండన్‌లోని నాచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్త క్రిస్ స్ట్రింగర్ చెప్పారు.
1.46 లక్షల ఏండ్ల నాటి కపాలం
ఈ కపాలం 1,46,000 ఏండ్ల నాటిదని శాస్త్రవేత్తలు తెలిపారు. కపాలంలో మెదడు పరిమాణం ఆధునిక మానవుని మెదడుతో సమానంగా ఉంది. కండ్ల గుంతలు, పళ్లు, నోరు పెద్దగా ఉన్నాయి. లాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో కపాలం దొరకడంతో దాని పేరు మీద కొత్త మానవ జాతికి ‘హోమో లాంగీ’ అని పేరు పెట్టారు. ఈ కపాలం పురుషుడిదని శాస్త్రవేత్తలు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

