Aramco helicopter | సౌదీలో అరాంకో హెలికాప్టర్ కూలి 14 మంది మృతి.. రస్ తనురా సమీపంలో ఘటన
Aramco helicopter : సౌదీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ ఆయిల్ సంస్థ అరాంకోకు చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మంది మరణించారు. మృతులంతా సౌదీకి చెందిన వారే. ఈ ఘటన సౌదీ అరేబియా ఉత్తర తీరంలోని రస్ తనూరాలో ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.00 గంటలకు జరిగింది.
Aramco helicopter : సౌదీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ ఆయిల్ సంస్థ అరాంకోకు చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మంది మరణించారు. మృతులంతా సౌదీకి చెందిన వారే. ఈ ఘటన సౌదీ అరేబియా ఉత్తర తీరంలోని రస్ తనూరాలో ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.00 గంటలకు జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై అరాంకో సంస్థ ఇంకా స్పందించలేదు.
అయితే, హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాద ఘటనకు, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంపై సౌదీ చమురు మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. సౌదీకి చెందిన చమురు సంస్థ అరాంకో 1934 నుంచి విమానయాన సేవలు కూడా అందిస్తోంది. 2023 నుంచి దీనికి సంబంధించిన సంస్థ పేరును అలౌలా ఏవియేషన్‌గా మార్చారు. ప్రస్తుతం ఈ సంస్థకు విమానాలు, హెలికాప్టర్లు వంటివి కలిపి 60 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో తీర ప్రాంత రవాణా సేవలు, సరుకుల రవాణా, వైద్య పరమైన తరలింపు సేవలను సంస్త నిర్వహిస్తోంది.
మరోవైపు ఫ్రాన్స్‌లో కూడా ఆదివారం ఉదయం 11.00 గంటలకు విమాన ప్రమాదం జరిగింది. స్కైడైవర్ల బృందంతో వెళ్తున్న చిన్న విమానం కూలడంతో 11 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు స్కైడైవింగ్ శిక్షకులు, ఐదుగురు విద్యార్థులు, పైలట్ ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

