Plane Crash | బ్రెజిల్లో కుప్పకూలిన విమానం.. సిబ్బంది సహా 14 మంది దుర్మరణం
బ్రెజిల్‌లోని (Brazil) ఉత్తర అమెజాన్‌లో (Northern Amazon) ఘోర విమాన (Plane Crash) ప్రమాదం జరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన బార్సెలోస్ ఉత్తర పట్టణంలోని బ్రెజిలియన్ అమెజాన్‌లో చిన్న విమానం కుప్పకూలింది.
రియో డి జెనీరో: బ్రెజిల్‌లోని (Brazil) ఉత్తర అమెజాన్‌లో (Northern Amazon) ఘోర విమాన (Plane Crash) ప్రమాదం జరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన బార్సెలోస్ ఉత్తర పట్టణంలోని బ్రెజిలియన్ అమెజాన్‌లో చిన్న విమానం కుప్పకూలింది. దీంతో 14 మంది మరణించారు. వారిలో ఇద్దరు పైలెట్లు కూడా ఉన్నారు. 12 మంది ప్రయాణికులు ఫిషింగ్ స్పోర్ట్ కోసం మానౌస్ ( Manaus) నుంచి బార్సిలోస్‌కు (Barcelos) ఈఎంబీ-110 అనే చిన్న విమానంలో వెళ్తున్నారు. అయితే వర్షం కారణంగా విమానాన్ని దించడానికి పైలట్లు ప్రయత్నించారు. దీంతో అది ప్రమాద వషాత్తు కూలిపోయిందని అమెజానాస్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా (Governor Wilson Lima) సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో తెలిపారు.
విమాన ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు వెళ్లడించారు. అది రెండు ఇంజిన్ల విమానమని, దీనిని బ్రెజిలియన్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారు ఎంబ్రైర్ అనే కంపెనీ తయారు చేసిందని చెప్పారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని తెలిపారు. మృతుల్లో అమెరికాకు చెందిన పౌరులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గౌతంపూర్ స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువు
AP Elections | ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ..ఎల్లుండి ఫలితాలు
తుంగతుర్తిలో దాశరధి కృష్ణమాచార్యులకి ఘన నివాళి
‘రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయాలి’
Foods | చలికాలంలో వ్యాయామం చేసే ముందు ఏ ఆహారం అయితే ఉత్తమం.. నిపుణులు ఏం సూచిస్తున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

