హాస్పిటల్లో అగ్నిప్రమాదం.. 11 మంది శిశువులు సజీవదహనం
పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో 11 మంది నవజాత శిశువులు సజీవదహనం చెందారు. మరో ముగ్గురు శిశువులను ప్రాణాలతో రక్షించారు. 11 మంది శిశువులు మృతి చెందడంతో ఆ దేశ అధ్యక్షుడు మాకీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. శిశువుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. తివోయానేలోని అబ్దుల్ అజిజ్ సై దబాఖ్ హాస్పిటల్‌లోని చిన్న పిల్లల వార్డులో బుధవారం నాడు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక పిల్లలు మృతి చెందారు. శిశువులు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు షాక్‌లోకి వెళ్లారు. ఎలక్ట్రిక్ షాక్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఈ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఇంటీరియర్ మినిస్టర్ ఆంటోనీ డైమో ఆదేశించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

