Four-Day Working | అక్కడ వారానికి నాలుగు రోజులే పనిదినాలు..!
Four-Day Working | ఇప్పటికే సాఫ్ట్వేర్ సంస్థలు వారానికి ఐదు రోజులు పనిదినాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, యూకేలోని కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఓ తీపి కబురు అందించాయి. అక్కడ సుమారు వంద కంపెనీలు ఉద్యోగులకు పని ఒత్తడిని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా సంచలన ప్రకటన చేశాయి. ఇకపై ఆయా కంపెనీలకు చెందిన ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాలంటూ తీపి కబురును చెప్పాయి.
Four-Day Working | ఇప్పటికే సాఫ్ట్వేర్ సంస్థలు వారానికి ఐదు రోజులు పనిదినాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, యూకేలోని కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఓ తీపి కబురు అందించాయి. అక్కడ సుమారు వంద కంపెనీలు ఉద్యోగులకు పని ఒత్తడిని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా సంచలన ప్రకటన చేశాయి. ఇకపై ఆయా కంపెనీలకు చెందిన ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాలంటూ తీపి కబురును చెప్పాయి.
అదికూడా జీతంలో ఎలాంటి కోత పెట్టకుండా, పని గంటలను సర్దుబాటు చేయకుండా.. నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని సూచించాయి. వంద కంపెనీల్లో దాదాపు 2,600 మంది పనిచేస్తున్నారు. 4డే వీక్ క్యాంపెయిన్‌లో భాగంగా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. లండన్‌లోని అతి పెద్ద కంపెనీలు అయిన అటమ్ బ్యాంక్, గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీ అవిన్ సైతం ఈ జాబితాలో ఉన్నాయి.
కాగా, ఈ కొత్త పాలసీని అమలు చేశాక కంపెనీ పనితీరు ఎలా ఉందనేది అవిన్ సీఈవో ఆడమ్ రాస్ వెల్లడించారు. కొత్త పాలసీతో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, కంపెనీ ఉత్పాదకతలో మార్పులేదని ఆయన తెలిపారు. ‘ఉద్యోగుల పనివేళలను నిజాయతీగానే తగ్గించాం. ఐదు రోజుల పనిగంటలను కుదించి నాలుగు రోజులకు సర్దుబాటు చేయలేదు. ఈ కొత్త పాలసీని అమలు చేశాక కంపెనీ ఉత్పాదకత కొంచెం కూడా తగ్గలేదు. తమ ఉద్యోగులు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఉద్యోగుల వలసలను సైతం ఇది అడ్డుకుంటుంది’ అని ఆయన వివరించారు.
కాగా, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, ఆక్స్ ఫర్డ్, బోస్టన్ యూనివర్సిలకు చెందిన పరిశోధకులు.. సుమారు 3,300 మంది ఉద్యోగులు ఉన్న 70 కంపెనీల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తూ, ఫలితాలను పరిశీలిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

