అమెరికాలో ట్రక్కు బీభత్సం
నూతన సంవత్సరం వేడుకల వేళ అమెరికాలోని న్యూఓర్లీన్స్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. విలాస వేడుకలకు పేరుపొందిన బార్బన్ స్ట్రీట్, ఐబర్విల్లే మధ్య వీధిలో బుధవారం తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో జన మూహంపైకి వేగంగా ఓ ట్రక్కు దూసుకువచ్చింది.
- న్యూఓర్లీన్స్‌లో జనంపైకి దూసుకెళ్లిన వాహనం
- 10 మంది మృతి.. 35 మందికి గాయాలు
- ట్రక్కు దిగి ప్రజలపై కాల్పులు జరిపిన డ్రైవర్
న్యూ ఓర్లీన్స్: నూతన సంవత్సరం వేడుకల వేళ అమెరికాలోని న్యూఓర్లీన్స్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. విలాస వేడుకలకు పేరుపొందిన బార్బన్ స్ట్రీట్, ఐబర్విల్లే మధ్య వీధిలో బుధవారం తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో జన మూహంపైకి వేగంగా ఓ ట్రక్కు దూసుకువచ్చింది. జనం భీతావహులై పరుగుత్తుతుండగా ట్రక్కు నుంచి దిగిన డ్రైవర్ జనంపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది మరణించగా, 35 మంది వరకు గాయపడ్డారు.
ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా పరిగణిస్తూ ఎఫ్‌బీఐ దర్యాప్తు చేపట్టింది. పోలీసులు జరిపిన ఎదురుకాల్పులలో ట్రక్కు డ్రైవర్ మరణించాడు. పేలుడు పదార్థాలు ఏవైనా దాచి ఉంచారా అన్న అనుమానంతో పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు జరుపుతున్నారు. ఘటనా స్థలంలో ఒక ఐఈడీగా అనుమానిస్తున్న వస్తువు లభించినట్టు ఎఫ్‌బీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా.. ట్రక్కు డ్రైవర్ సాగించిన హత్యాకాండను ఉగ్రవాద చర్యగా న్యూ ఓర్లీన్స్ మేయర్ లాటోవా కాంట్రెల్ అభివర్ణించారు.
ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యలని నగర పోలీసుకమిషనర్ అన్నే కిర్క్‌పాట్రిక్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే మారణకాండ సృష్టించడానికి ట్రక్కు డ్రైవర్ ప్రయత్నించాడని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పారు. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు వేలాది మంది బార్బన్ వీధిలో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించడంతో అక్కడకు ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లవద్దని ప్రజలను పోలీసులు కోరారు. ఘటనలో గాయపడిన వారిని దవాఖానలకు తరలించి చికిత్స అందచేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

