పారిస్: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సుదీర్ఘ కాలం రేడియో టెలిస్కోప్ ద్వారా పరిశోధన తర్వాత గురుత్వాకర్షణ తరంగాలు విశ్వం అంతటా ‘హమ్’ అనే నేపథ్య ధ్వనిని సృష్టిస్తున్నట్టు ఖగోళ శాస్త్రవ్తేత్తలు గుర్తించారు.
ఓ హింసాత్మక ఘటన కారణంగా పుట్టిన అత్యంత ఎక్కువ పౌనఃపున్యం కలిగిన తరంగాలు భూమి వైపు బలమైన, చిన్న పేలుడు అలలను పంపుతున్నట్టు కనుగొన్నారు. అయితే శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా తక్కువ పౌనఃపున్యం కలిగిన గురుత్వాకర్షణ తరంగాల కోసం శోధిస్తున్నారు. ఇవే నిరంతరాయంగా తిరుగుతూ నేపథ్య ధ్వనికి కారణమవుతున్నట్టు భావిస్తున్నారు.