లండన్, నవంబర్ 23: బ్రిటన్ మంజూరు చేసే అన్ని రకాల వీసాల్లో భారతీయుల హవానే కనిపిస్తున్నది. స్టూడెంట్ వీసా, మెడికల్ ప్రొఫెషనల్స్ వీసా, పర్యాటక వీసా ఇలా ఏ క్యాటగిరీలోనైనా భారతీయులే ఎక్కువ వీసాలు దక్కించుకొంటున్నారు. ఈ ఏడాది వీసాల డాటాను (సెప్టెంబర్ 2023 నాటికి) బ్రిటన్ హోం శాఖ విశ్లేషించగా.. ఆరోగ్య రంగ నిపుణులు, స్టూడెంట్ ఇలా పలు క్యాటగిరీల వీసాల్లో భారతీయులే తొలిస్థానంలో ఉన్నట్టు తేలింది. నైపుణ్య కార్మికులు-ఆరోగ్య నిపుణుల వీసాల్లో భారతీయుల సంఖ్య 38,866 ఉండగా.. తర్వాత స్థానాల్లో నైజీరియా (26,715), జింబాబ్వే (21,130) ఉన్నాయి.