హైదరాబాద్ : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి.. ఓ ఇద్దరు యువకులు తమ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అంతే కాదు వారి స్నేహితులంతా కలిసి కత్తులతో డ్యాన్స్ చేశారు. ఈ ఘటన నగరంలోని హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా శుక్రవారం వెలుగు చూసింది. కత్తులతో డ్యాన్స్ చేసిన యువకుల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సాయిరామ్, అర్జున్‌తో పాటు ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.