కొండాపూర్, ఏప్రిల్ 27: మదీనాగూడలోని యమహా బ్లూ స్కేర్ షో రూం ప్రారంభమైంది. ఈ సందర్భంగా యమహా డైరెక్టర్ కవాయ్ హిడెఫుమీ మాట్లాడుతూ.. యమహా బైక్స్లకు ప్రత్యేక స్థానం ఉందని, యువకుల అభిరుచులకు అనుగుణంగా బైక్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చామన్నారు. హట్వీల్స్ ఆటోమోటివ్ ప్రై.లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తేజ పవన్ మాట్లాడుతూ..యమహాలో గృహిణిలకు కావాల్సిన ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
డైరెక్టర్ కవాయ్తో కేకును కట్ చేయించిన అనంతరం బైక్ రేసర్లకు యమహా టీ షర్ట్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ యమహా మోటర్స్ సౌత్ జోనల్ హెడ్ సౌత్ టిజి మోహన్‌రాజ్, తెలంగాణ, ఏపీ, రీజినల్ హెడ్ మహేశ్, రీజినల్ హెడ్ సర్వీసెస్ ఎ.సత్యనారాయణ, బ్లూస్కేర్ డైరెక్టర్లు రాజా బహదూర్, కల్యాణ విక్రాంత్, బీఎమ్ విద్యాధర్ పాల్గొన్నారు.