DDMS | 14వ తేదీ నుంచి యూట్యూబ్ వీడియోల తయారీపై వర్క్‌షాప్
DDMS | యూట్యూబ్‌లో వీడియోల తయారీపై ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ లిటరసీ హౌజ్‌లో ఈ నెల 14వ తేదీ నుంచి వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 7 : యూట్యూబ్‌లో వీడియోల తయారీపై ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ లిటరసీ హౌజ్‌లో ఈ నెల 14వ తేదీ నుంచి వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సృజనాత్మకతమైన వారు యూట్యూబ్ ద్వారా సంపాదించాలనుకునే వారికి ఈ వర్క్‌షాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
యూట్యూబ్ చానల్ క్రియేట్ చేయడం, దాని ద్వారా ఫేమస్ అవడమే కాకుండా డబ్బు సంపాదించడం వంటి విషయాలను వర్క్‌షాప్‌లో నేర్పిస్తామని వివరించారు. ప్రస్తుత సోషల్ మీడియాకు ఉన్న క్రేజ్‌ను ఉపాధిగా మలుచుకోవడం ద్వారా యువత వారి ఆలోచన, సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశాన్ని తెలుసుకుని వినియోగించడం నేర్చుకోవచ్చని పేర్కొన్నారు.
ఆరు రోజుల పాటు నిర్వహించే ఈ వర్క్‌షాప్‌కు అన్ని వయసుల వారు హాజరుకావచ్చని, ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 8498080599, 9951210441, 040-27098406 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

