Alwal : సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్లో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన సదరు యువతి ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరేసుకుంది. కేసు నమోదు చేసిన అల్వాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది