దుస్తులను అందించేదే సీఎంఆర్..
అందమైన వస్ర్తాలంకరణ సమాజంలో గౌరవాన్నిస్తుంది. మాఘమాసం పెండ్లీల సీజన్లో అందరికీ అందమైన దుస్తులను సరసమైన ధరలలో అందిస్తూ మరింత ప్రత్యేకతను సంతరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పరిచయం అక్కరలేని వస్త్ర నిధిగా పేరొందిన సీఎంఆర్ ఫ్యాషన్ మాల్.
- వివాహాల సీజన్లో అందరికీ అందమైన..
జూబ్లీహిల్స్: అందమైన వస్ర్తాలంకరణ సమాజంలో గౌరవాన్నిస్తుంది. మాఘమాసం పెండ్లీల సీజన్లో అందరికీ అందమైన దుస్తులను సరసమైన ధరలలో అందిస్తూ మరింత ప్రత్యేకతను సంతరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పరిచయం అక్కరలేని వస్త్ర నిధిగా పేరొందిన సీఎంఆర్ ఫ్యాషన్ మాల్. సకుటుంబ సపరివార సమేతంగా షాపింగ్ చేయగలిగే చక్కటి క్లాతింగ్ కలెక్షన్స్‌తో పాటు పసిడి కాంతుల శోభను వ్యాప్తిచేస్తూ సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెల్లర్స్ ద్వారా బంగారం, వజ్రాభరణాలను అందిస్తున్నది. నిరంతరం కస్టమర్ల అభిమానాన్ని పొందుతూ.. విజయవంతంగా కొనసాగుతున్న ఈ సంస్థకు మూలం.. చందన మోహన్‌రావు గారు.
నేరుగా ఉత్పత్తిదారుల నుంచే వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా వ్యయం తగ్గి.. సరసమైన ధరలకు విక్రయించవచ్చనే విజయమంత్రాన్ని ఆచరిస్తూ ఉన్నతమైన నాణ్యతా విలువలను పాటిస్తూ కనీ విని ఎరుగని అమ్మకాలను సాధించి వ్యాపారాన్ని విస్తరించారు. నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివాహాది శుభకార్యాలకు అవసరమైన వస్ర్తాలు, ఆభరణాలు, ఇతర అలంకరణ వస్తువులన్నీ ఒకేచోట దొరికే మాల్ అనగానే ప్రతి ఇంట్లో వినిపించే పేరు సీఎంఆర్.. అంటే అతిశయోక్తి కాదు.
వివాహాల సీజన్లో ఆకట్టుకునే వస్ర్తాలు..
ఆకుట్టుకునే ప్రత్యేకమైన వస్త్ర, ఆభరణాల డిజైన్స్.. ఐదు దశాబ్దాల కిందట నెలకొల్పిన చందన బ్రదర్స్.. టెక్స్లైట్స్ అండ్ జ్యువెల్లర్స్ సీఎంఆర్‌గా తెలంగాణ నడిబొడ్డున సంప్రదాయం, నాణ్యత, పారదర్శకమైన సేవలకు మారుపేరుగా నిలిచింది. ఫ్యాషన్, ైస్టెలిష్ కలెక్షన్స్, లేటెస్ట్ శారీస్, డిజైనర్ డ్రెసెస్ ద్వారా ప్రజల ఆదరణ మెండుగా పొందింది. సరికొత్త డిజైన్స్‌తో వస్ర్తాలనే గాక.. ఆభరణాల రంగంలో ప్రత్యేకతను కలిగి తెలంగాణ అంతటా 15కు పైగా గోల్డ్ షోరూమ్‌ల నెట్‌వర్క్‌ను కలిగిన సీఎంఆర్.. కస్టమర్ల మనసులో చెరగని ముద్ర వేసింది.
ప్రతి అభిరుచిని దృష్టిలో పెట్టుకుని..
సందర్భానికి అనుగుణంగా విభిన్నమైన కలెక్షన్లను అందిస్తుంది. సాంప్రదాయం నుంచి సమకాలీన శైలి వరకు, తేలికపాటి రోజువారీ దుస్తుల నుంచి క్లిష్టమైన ఆలయ ఆభరణాల వరకు సీఎంఆర్ క్యూరేటెడ్ అన్‌కట్ వజ్రాలు, విక్టోరియన్ ైస్టెల్స్, ప్రత్యేకమైన 18 ఓ గులాబీ గోల్డ్ పీసెస్, ఆలయ డిజైన్లు, కుందన అంకారాలు, డైమండ్ క్రియేషన్స్, ఆభరణాలు, ప్లాటినం పీసెస్.. అలాగే, సొగసైన వెండి వస్తువులకు చిరునామాగా సీఎంఆర్ నిలుస్తోంది.
అన్నింటా మేటి సీఎంఆర్..
ఉత్పత్తుల్లో మాత్రమే కాదు.. ప్రమోషన్ ఈవెంట్లో కూడా తమదైన విశిష్టతను తెలియజేసేలా నగర వాసులకు సరికొత్త అనుభూతిని అందించింది సీఎంఆర్. ఇటీవల కేపీహెచ్బీలో సీఎంఆర్ ఫ్యామిలీ మాల్‌ను నూతనంగా ప్రారంభించారు. ఈ సమయంలో సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలోని కెత్లాపూర్ గ్రౌండ్లో అందమైన ఫ్యాషన్ వాక్‌తో పాటు నిర్వహించిన మెగా డ్రోన్ షోలు చిత్ర విచిత్ర విన్యాసాలతో అలరించారు. వినూత్నమైన గేమ్ షోలు, లక్కీ డ్రా వంటి వాటి ద్వారా ప్రజలకు మరింత చేరువవుతూ.. అందుబాటులో ఉన్న సీఎంఆర్ ఫ్యామిలీ మాల్గా నిలిచింది.
అల్లక సత్యనారాయణ సువర్ణాలోచన..
సీఎంఆర్ జ్యువెల్లర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అల్లక సత్యనారాయణ క్యాషియర్‌గా పనిచేస్తూ బలమైన.. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. దాదాపు 40 సంవత్సరాల కిందట ఈ విజయవంతమైన వ్యాపార వెంచర్‌కు పునాది వేశారు. ఆయన 2001 లో ఆంధ్రప్రదేశ్‌లో మొదటి బ్రాంచ్‌ను ప్రారంభించారు. అది నేడు 25 షాప్‌లు, 4 బ్రాండ్లు, 2 సెంట్రల్ షాపింగ్ మాల్స్‌గా అభివృద్ధి చెందింది. అద్భుతమైన విజన్‌లో సీఎంఆర్ జ్యువెల్లర్స్ పారదర్శకత, నాణ్యత తనిఖీలపై ఆయన చూపిన ప్రాధాన్యత సాటిలేని ప్రమాణంగా నిరూపితమైంది. ఆంధ్రప్రదేశ్‌లో 916 హాల్‌మార్క్ బంగారు ఆభరణాలను పరిచయం చేసిన తొలి స్టోర్ సీఎంఆర్ షాపింగ్ మాల్ కావడం విశేషం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

