తెలుగుయూనివర్సిటీ : కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందేల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖామంత్రి తన్నీరు హారీష్‌రావు హామీ ఇచ్చారు.
తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నీలోఫర్ యూనిట్ రూపొందించిన 2022 క్యాలెండర్‌ను ఆవిష్క రించిన మంత్రి హారీష్‌రావు ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ నిబద్దతతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ దవఖానాలకు వైద్య, చికిత్సల కోసం వచ్చే పేద, మధ్య తరగతి ప్రజలేనని వారికి సకాలంలో సేవలను అందించి మన్ననలు పొందాలని కోరారు.
అవుట్సోర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, నాల్గవ తరగతి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీనిచ్చారు. సంఘం అధ్యక్షులు ఆర్.నాగేశ్వరరావు, కార్యదర్శి డి.రవీందర్, ఖుద్రత్, ఎం.రవి, యెల్లేశం, ఎస్.ప్రవీణ్‌కుమార్, జి. శ్రీనివాస్, రాజ్‌కుమార్, జహాంగీర్, హీరాలాల్, నిర్మాలాదేవి తదితరులు పాల్గొన్నారు.