హైదరాబాద్ : నగరంలో విషాదం చోటు చేసుకుంది. కూకట్పల్లి(Kukatpally )భీమునికుంట చెరువులో(Bhimunikunta pond) దూకి ఓ వ్యక్తి మృతి(Committed suicide) చెందాడు. మృతుడు వాచ్మెన్(Watchman) బాలయ్యగా గుర్తించారు. నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకెళ్లిన బాలయ్య ఇలా చెరువులో శవమై కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాలయ్య మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.