నగ్నంగా చాటింగ్.. ఆపై బ్లాక్మెయిల్

- ఈవెంట్ మేనేజర్‌ను రెచ్చగొట్టిన సైబర్క్రిమినల్స్
- ఆ వీడియోలతో బెదిరింపులు.. రూ. 10 లక్షలు వసూలు
హైదరాబాద్ : సైబర్‌నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. పైసా కంటే పరువు ముఖ్యమనుకునే వాళ్లను లక్ష్యంగా చేసుకొని లక్షలు దోచేస్తున్నారు. ఫేస్బుక్లో స్నేహితురాలిగా పరిచయం అయి.. ఆ తరువాత నగ్న వీడియోలతో బాధితులను బ్లాక్మెయిల్ చేస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సైబర్‌క్రైమ్ ఠాణా పరిధిలో ఓ ఈవెంట్ మేనేజర్‌ను బ్లాక్మెయిల్ చేసి రూ. 10 లక్షలు వసూలు చేసిన ఘటన వెలుగులో కి వచ్చింది. తార్నాక ప్రాంతంలో నివాసముండే ఓ ఈవెంట్ మేనేజర్‌కు ఫేస్బుక్లో ఓ యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయంతో ఇద్దరు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. ఆ తరువాత వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ, బాధితుడిని సైబర్‌నేరగాళ్లు రెచ్చగొట్టారు. ముందుగా తమ వద్ద ఉన్న వీడియోలు, అప్లికేషన్ల సహాయంతో నగ్న వీడియోలను ప్లే చేస్తూ బాధితుడిని బుట్టలో వేశారు. వాటితో బాధితుడిని రెచ్చగొట్టి, అతడితో నగ్నంగా చాటింగ్ చేయించారు. ఆ చాటింగ్‌ను వీడియో రికార్డు చేసి.. బాధితుడిని బ్లాక్మెయిల్ చేశారు. మేం అడిగినంత ఇవ్వకపోతే ఈ వీడియోలు సోషల్‌మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ బెదిరిస్తూ బాధితుడి నుంచి దఫ దఫాలుగా రూ. 10 లక్షలు వసూలు చేశారు. మొదటిసారి కొంత డబ్బు ఇవ్వగానే పరువు కోసం బాగా పాకులాడుతున్నాడని భావించిన సైబర్ క్రిమినల్స్.. రెండో దఫా కూడా డిమాండ్ చేస్తూ వసూలు చేశారు. ఇంకా డబ్బు అడుగుతుండటంతో బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

