విక్టోరియాను ఉత్తమ బోధనా కేంద్రంగా మారుస్తాం

- మరింత అంకిత భావంతో ఉపాధ్యాయులు పనిచేయాలి
- రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ / ఆర్కేపురం, మార్చి 4 : చారిత్రక విక్టోరియా మెమోరియల్ హోం అండ్ ఇండస్ట్రీయల్ స్కూల్‌ను అత్యుత్తమ బోధనా కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురువారం సరూర్‌నగర్‌లోని పాఠశాల ప్రాంగణంలో జరిగిన పాలక మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విక్టోరియా మహారాణి స్మారకార్ధం అనాథ బాలబాలికల కోసం ఏర్పాటైన ఈ గురుకులాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అయితే ఉపాధ్యాయులు, సిబ్బంది సేవాభావంతో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలని సూచించారు.
విద్యతోపాటు పోటీ ప్రపంచాన్ని తట్టుకునేవిధంగా ఆంగ్ల భాషలో పట్టుసాధించేలా విద్యార్థులను సంసిద్ధం చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య, శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే విధంగా అందరూ సమష్టి కృషి చేయాలని వివరించారు. ‘విక్టోరియా’లో చదివి పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రభుత్వ గురుకుల కళాశాలల్లో, ఇంటర్ పూర్తి చేసిన వారికి డిగ్రీ కళాశాలల్లో ఎంట్రన్స్ లేకుండానే ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఆసక్తి ఉన్నవారికి వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. పూర్వ విద్యార్థుల వివరాలు సేకరించి ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అంతకుముందు విద్యాలయ ప్రాంగణం అంతా కలియతిరిగి పలు సూచనలు చేశారు. అవసరం అనుకుంటే డైనింగ్ హాల్‌ను విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి విజయ్‌కుమార్, కమిషనర్ యోగితారాణా, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, ‘విక్టోరియా’ ప్రిన్సిపాల్ సుహాసి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

