ఏజెన్సీలకు దోచిపెట్టేందుకేనా..?
ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనాలకు అమర్చే స్టిక్కరింగ్ ప్రక్రియ రోజురోజుకు వివాదస్పదమవుతున్నది. రేడియం స్టిక్కరింగ్ ధరలు రవాణాశాఖ అధికారులు అనూహ్యంగా పెంచింది. దీంతో వాహనదారులు రేడియం స్టిక్కరింగ్ అమర్చడానికి డబ్బులు లేవంటూ వెనుతిరిగిపోతున్నారు.
- ఆర్టీఏ స్టిక్కరింగ్ ధరలు పెంచడంపై వాహన సంఘాల ఆగ్రహం
- ధరలు తగ్గించకపోతే ఉద్యమిస్తామంటూ హెచ్చరిక
- ఏడాదికోసారి స్టిక్కర్లు మార్చే నిబంధనపై విమర్శలు
సిటీబ్యూరో, మార్చి 28 ( నమస్తే తెలంగాణ ): ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనాలకు అమర్చే స్టిక్కరింగ్ ప్రక్రియ రోజురోజుకు వివాదస్పదమవుతున్నది. రేడియం స్టిక్కరింగ్ ధరలు రవాణాశాఖ అధికారులు అనూహ్యంగా పెంచింది. దీంతో వాహనదారులు రేడియం స్టిక్కరింగ్ అమర్చడానికి డబ్బులు లేవంటూ వెనుతిరిగిపోతున్నారు. కొన్ని కార్యాలయాల్లో అధికారులకు, వాహనదారుల మధ్య వాగ్వాదం జరుగుతున్నది.
ధరల విషయం తమకు సంబంధం లేదని ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెప్పగా, ఏజెన్సీలకు దోచిపెట్టేందుకు తమను బలి పశువులను చేయడం ఏంటని వాహన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో స్టిక్కర్ గతంలో ఆర్టీసీ రూ.80 నుంచి 100 లోపు చేసిందని చెప్పారు. ఇప్పుడు రూ.500 పైనే వసూలు చేస్తున్నారని విమర్శించారు. స్టిక్కరింగ్ ప్రక్రియను 5 కంపెనీలకు ఆర్టీఏ అప్పగించింది. 37 మంది డీలర్లు కంపెనీల తరపున స్టిక్కరింగ్ ప్రాసెస్ చేయనున్నారు. అయితే ఆ కంపెనీలకు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం సహేతుకమైంది కాదన్నారు.
ఏడాదికోసారా?
గతంలో రేడియం స్టిక్కర్లు వేసుకున్నాక మూడేండ్లు గ్యారెంటీ ఇచ్చేవాళ్లు. ఇప్పుడు కేవలం ఏడాది మాత్రమే గ్యారెంటీ ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. అంత పెద్ద కంపెనీలు అని చెప్పే రవాణా శాఖ ఆ కంపెనీల స్టిక్కర్లను అమర్చుకుంటే కేవలం ఏడాది వ్యాలిడిటీ ఉండటం ఏంటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు దండుకోవడమే లక్ష్యంగా ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. అంతేకాదు స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తవడానికి ఒక్క రోజు సమయం కేటాయించాల్సి రావడం గమనార్హం. రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే ప్రతి వాహనానికి ముందుగా కొలతలు తీస్తున్నారు. ఆ తర్వాత స్టిక్కర్ వేస్తున్నారు. ఫొటోలు తీస్తున్నారు. ఫీజు చెల్లింపులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇవ్వన్నీ పూర్తయ్యాకనే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ అవుతున్నది. ఈతంతంగం అంతా కేవలం ఆ కంపెనీలకు చెందిన స్టిక్కర్లు అమర్చుకోవడం కోసమేనని వాహనదారులు విమర్శిస్తున్నారు.
ధరలు తగ్గించకపోతే ఉద్యమిస్తాం
ఆర్టీఏ ఏజెన్సీలకు స్టిక్కరింగ్ ప్రక్రియ అప్పజెప్పి చోద్యం చూస్తున్నది. ప్రమాదాల నివారణకు రవాణా శాఖ ఉచితంగా రేడియం స్టిక్కర్లు అమర్చాలి. మినిమం చార్జీలు వసూలు చేయడంలో తప్పులేదు. కానీ డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా ఏజెన్సీలకు దోచిపెడుతున్నాయి. గతంలో స్టిక్కరింగ్ ప్రక్రియను ఆర్టీసీ సైతం చేపట్టింది. అప్పుడు రూ.80 ఉంటే 120 చేస్తేనే పెద్ద ఎత్తున ఉద్యమించాం. ఇప్పుడు వేల రూపాయలు దండుకోవడం సరైనది కాదు. రవాణా శాఖ స్టిక్కరింగ్ ధరలను తక్షణమే తగ్గించాలి.
– సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఫెడరేషన్
రవాణా శాఖ నిర్ణయాలు మార్చుకోవాలి
రేడియం స్టిక్కర్లను నాలుగు విదేశీ కంపెనీలకు అప్పగించారు. ఆ కంపెనీల డీలర్లు సగానికి పైగా ఇతర రాష్ర్టాలకు చెందినవారే ఉన్నారు. వారికి దోచిపెట్టేందుకు వాహనదారులపై అధిక భారం వేయాలా? ఇక్కడి కంపెనీలు లేవా? స్టిక్కరింగ్ వేయడాన్ని ఇన్ని రోజులు మన రేడియం పనులు చేసేవాళ్లు లేరా? ఇక్కడి వారి ఉపాధిని దెబ్బకొట్టేలా నిర్ణయాలు చేయడం సరైంది కాదు. ప్రభుత్వం పునఃఆలోచించి స్టిక్కర్ ధరలు తగ్గించాలి.
– వేముల మారయ్య, తెలంగాణ ఆటో యూనియన్ అధ్యక్షుడు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

