నీట్‌పై ఐక్య విద్యార్థి ఆందోళన
నీట్ అవకతవకల ను నిరసిస్తూ వందలాది విద్యార్థులు కదంతొక్కారు. సోమవారం ఒక్కసారిగా వందలాది గా విద్యార్థులు రాజ్‌భవన్ ముట్టడికి బయల్దేరారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉ ద్రిక్తంగా మారి లాఠీచార్జికి దారి తీసింది. విద్యార్థులను అడ్డుకునే క్రమంలో పోలీసు వాహనం సైతం ధ్వంసమైంది.
- పోలీసు కారు అద్దాలు ధ్వంసం
- ఉద్రిక్తంగా పరిస్థితి.. పలువురి అరెస్టు
ఖైరతాబాద్, జూలై 1: నీట్ అవకతవకల ను నిరసిస్తూ వందలాది విద్యార్థులు కదంతొక్కారు. సోమవారం ఒక్కసారిగా వందలాది గా విద్యార్థులు రాజ్‌భవన్ ముట్టడికి బయల్దేరారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉ ద్రిక్తంగా మారి లాఠీచార్జికి దారి తీసింది. విద్యార్థులను అడ్డుకునే క్రమంలో పోలీసు వాహనం సైతం ధ్వంసమైంది. వివరాల్లోకి వెళి తే.., నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చే యాలని విద్యార్థి, యువజన ఐక్య సంఘాల ఆధ్వర్యంలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమా న్ని చేపట్టారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నేతృత్వంలో ఎన్ఎస్యూఐతో పాటు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, వీజేఎస్, పీవైసీ, డీవైఎఫ్ఐ, ఎఐవైఎఫ్, వైజీఎస్ల సంయుక్తాధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నెక్లెస్ రోడ్డులోని రోటరీ చౌర స్తా వద్ద వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్ర మంలో పోలీసు వాహనం అద్దాలు పగిలా యి. దీంతో ఆందోళనకారులపై లాఠీలు ఝు లిపించారు. అనంతరం, వారిని అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, గత 20 రోజుల నుంచి నీట్ విద్యార్థుల పక్షాన ఐక్య విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 70 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, ఈ విషయంపై స్పందించమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరితే, ఆయన పట్టించుకోలేదని, దీంతో ఆయన ఇంటిని సైతం ముట్టడించామన్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ కోరితే ఇవ్వలేదని, అందుకే రాజ్‌భవన్ ముట్టడికి బయల్దేరామని తెలిపారు.
ఘనంగా ఎస్బీఐ బ్యాంక్ డే వేడుకలు
ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ 69వ స్టేట్ బ్యాంక్ డేను పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. సీఎస్ఆర్ కార్యక్రమాలు, ట్రీ ప్లాంటేషన్లలో భాగస్వామ్యం, బ్యాంకు విజయంలో కీలక పాత్ర పోషించిన వారిని సత్కరించి బహుమతులు అందజేసింది. ఈ సందర్భంగా సీజీఎం రాజేశ్‌కుమార్ ఆధ్వర్యంలో రిటైర్డ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సత్కరించారు. అనంతరం డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు.
– సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ)
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

