Railway works | ఉందానగర్-గొల్లపల్లి విద్యుదీకరణ పనులు పూర్తి
ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పన, సామర్థ్యం పెంపు, మెరుగైన భద్రత చర్యల కోసం దక్షిణ

హైదరాబాద్: ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పన, సామర్థ్యం పెంపు, మెరుగైన భద్రత చర్యల కోసం దక్షిణ మధ్య రైల్వే నిరంతరంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా ఎస్సీఆర్ జోన్ నెట్వర్క్ పరిధిలో అన్ని రైల్వే లైన్ల విద్యుధీకరణ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. కొనసాగింపుగా ఉందానగర్-గొల్లపల్లి మధ్య 60 కి.మీ డబుల్ లైన్ విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. ఇది హైదరాబాద్ నుంచి కర్నూల్, అనంతపురం, బెంగళూరు, కడప, తిరుపతి వంటి ప్రధాన నగరాలతో అనుసంధానించడంలో కీలకమైనది. ఈ ప్రాజెక్టు రైల్వే పీఎస్‌యూ, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతుందని శనివారం ఎస్సీఆర్ అధికారులు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో రైళ్ల నిర్వహణ బలోపేతానికి సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. 85 కి.మీ నిడివి ఉన్న ఈ ప్రాజెక్టు రూ.774 కోట్ల అంచనా వ్యయంతో 2015-16లో మంజూరు చేశారు. సికింద్రాబాద్-ఉందానగర్ మధ్య 28 కి.మీ ప్రాజెక్టు నుంచి మినహాయించబడింది. అయితే దీనిని ఎంఎంటీఎస్ రెండో దశ కింద ప్రాజెక్టు చేపట్టడంతో పాటు ఆ మేరకు పనులు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

