పండిద్దాం..విదేశాలకు పంపిద్దాం

- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆర్టీసీ కార్గో కేంద్రం
- మన పంటలకు విదేశాల్లో డిమాండ్
- ఉత్పత్తుల ఎగుమతికి చక్కటి అవకాశం
- రైతులకు భారీగా తగ్గనున్న రవాణా చార్జీలు
మన రైతులు పండించిన చాలా పంటలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఎగుమతి చేసే అవకాశం లేకపోవడం, వ్యయప్రయాస కావడంతో విదేశాలకు ఎలా పంపించాలో తెలిసేది కాదు. ఈ ఇబ్బందులను తప్పించి రైతు పొలం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు ఎయిర్‌పోర్టులో కార్గో కేంద్రం ఏర్పాటుకు జీఎంఆర్ సంస్థ అంగీకరించింది. ఆర్టీసీ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ, జీఎంఆర్ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదరడంతో ఎయిర్‌పోర్టులో కార్గో కేంద్రాన్ని ఏర్పా టు చేశారు. దీంతో రైతు ఎవరైనా పంట పొలం నుంచే నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసుకొని లాభాన్ని ఆర్జించవచ్చు. ప్రధానంగా పండ్లు, బాస్మతి బియ్యం వంటి పలు రకాల పంటలను ఆసియా దేశాలకు అతితక్కువ ఖర్చుతో ఎగుమతి చేయవచ్చు.
రైతుకు అధిక లాభం..
పంటలను ఆసియా దేశాలకు ఎగుమతి చేయాలంటే రైతుకు రవాణా చార్జీలు తడిసి మోపెడయ్యేవి. తప్పనిసరిగా ప్రైవేటు వాహనాలతోనే ఎయిర్‌పోర్టుకు సరుకు చేరవేసేవారు. దీనివల్ల గిట్టుబాట ధర వచ్చేది కాదు. ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్సీసుల వల్ల రైతులకు 50 శాతం వరకు చార్జీలు తగ్గుతాయని కార్గో ఇన్చార్జి కృష్ణకాంత్ తెలిపారు. ప్రధానంగా గిట్టుబాటు ధర రాని టమాటాను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసుకోవచ్చన్నారు. ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవలు ఉపయోగించుకోవాలనుకున్న రైతులు ఆర్గానిక్ పంటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇతర దేశాల్లో ఆర్గానికి ఫుడ్‌కు మంచి డిమాండ్ ఉండడమే ఇందుకు కారణమన్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో అధిక డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే ఎగుమతి చేసేలా ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతూ రైతులకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

