మీ మొబైల్ నంబర్‌ను ఆర్టీఏలో లింక్ చేసుకోండి..

- లేదంటే ఇబ్బందులు రావొచ్చు..
- చలాన్లు పడినా తెలియకుండాపోతుంది..
- ఎక్కువ మొత్తంలో జరిమానాలు ఉంటే.. గుది బండలా మారవచ్చు
వాహనదారులూ.. ఆర్టీఏలో మీ మొబైల్ నంబర్‌ను లింక్ చేసుకున్నారా…ఇంకా చేసుకోలేదా…అయితే వెంటనే చేసుకోండి. లేదంటే చలాన్లు పడిన విషయం మీకు తెలియకుండా పోతుంది. అది మీకు కొండంత భారమూ కావొచ్చు.. మనం వాహనాలను ఎవరికైనా ఇచ్చినప్పుడు వారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. జరిమానాలు వేస్తారు…ఫోన్ నంబర్ లింక్ లేకపోతే..ఎన్ని చలాన్లు పడ్డాయో కూడా తెలియదు. ఎక్కువ మొత్తంలో ఉంటే.. గుదిబండలా మారుతుంది. అవి చెల్లించకపోతే చట్టపరమైన చర్యలూ ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రూ. 20 వేలపైనే..
ఇటీవల గచ్చిబౌలిలో సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు ఓ ద్విచక్రవాహనాన్ని ఆపారు. అతని చలాన్లు చూస్తే దాదాపు రూ. 20 వేలపైనే ఉన్నది. అసలు వాహన యజమాని గురించి ఆరా తీశారు. అతనిని పిలిపించి మీ వాహనం మీద రూ. 20 వేల చలాన్ ఉంది. వాటికి కూడా గడువు తీరింది. ఇప్పుడు మీ వాహనాన్ని సీజ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే తనకు చలాన్ల విషయం తెలియదని… అవసరాల కోసం మా పక్కింటిలో ఉంటున్న యువకుడికి ఇచ్చానని వివరించాడు. ఇన్ని జరిమానాలు ఎందుకు వచ్చాయని ఆరా తీస్తే..ఆ యువకుడు రాంగ్ రూట్లో వెళ్లి వేగంగా తిరిగి రావడం చేశాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు కొట్టి..చలాన్లు వేశారు. నంబర్ లింక్ లేకపోవడంతో యజమానికి ఎన్ని చలాన్లు పడ్డాయో కూడా తెలియకుండా పోయింది.
తప్పనిసరిగా…
ప్రతి వాహనదారుడు ఆర్టీఏ రికార్డుల్లో తన ఫోన్ నంబరును జోడించుకోవాలి. వాహనం కొన్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం. ఒకవేళ అది మారితే.. వెంటనే అప్డేట్ చేసుకోవాలి. పాత వాహనాలను కొన్నప్పుడు కూడా ఈ ప్రక్రియ తప్పనిసరి అని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇలా చేసుకుంటే మీకు చలాన్ల సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. ఒక వేళ జరిమానా తప్పుగా పడినా.. వెంటనే అప్రమత్తమై.. ఆ సమాచారాన్ని ట్రాఫిక్ అధికారులు, లేదా పోలీస్, ఆర్టీఏ వెబ్ సైట్లలో ఫిర్యాదు చేసుకోవచ్చు.
వాహనం అమ్మినా..
మాదాపూర్‌లో ఓ యువకుడు ట్రిపుల్ రైడింగ్, రాంగ్రూట్లో ప్రయాణిస్తుంటే.. ట్రాఫిక్ పోలీసులు ఆపి.. చలాన్లు తనిఖీ చేశారు. దాదాపు రూ. 42 వేల వరకు నగదు పెండింగ్‌లో ఉన్నది. యజమానిని పిలిపిస్తే కంగుతిన్నాడు. ఈ చలాన్లు చెల్లించాలంటే.. తన వాహనం అమ్మినా.. అంత డబ్బు రాదని వాపోయాడు. అతనికి కొంత వయసు భారం ఉండటంతో కొన్ని పనులకు తెలిసిన వారికి వాహనాన్ని ఇచ్చాడు. అలా ఓ యువకుడు ట్రిపుల్ రైడింగ్‌తో పాటు రాంగ్రూట్లో ప్రయాణించాడని తేలింది. దీనికి తోడు ఆర్టీఏలో ఫోన్ నంబర్ లింక్ చేసుకోకపోవడంతో జరిమానాల సంగతి యజమానికి తెలియలేదు.
ఎవరికైనా బండి ఇచ్చినప్పుడు..
ఎవరికైనా మన వాహనం ఇచ్చినప్పుడు అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే అతని డ్రైవింగ్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగినా.. ఆ ప్రమాదంలో ఎవరైనా మరణించినా.. యజమానిపై కేసు తప్పదంటున్నారు పోలీసులు. మనం నిబంధనలను ఉల్లంఘించినా.. ఆ సమాచారం మనకు తెలియాలంటే కచ్చితంగా ఆర్టీఏ రికార్డుల్లో మన ఫోన్ నంబర్ రిజిస్టర్ అయ్యి ఉండాలి. మీ వాహనం మీద చలాన్ జారీ అయిన విషయాన్ని తెలుసుకోవాలంటే వెంటనే https://tgtransport.net/TGCFSTONLINE/OnlineTransactions/UpdateMobileNumber.aspx సంప్రదించాలి. అలాగే ఈ లింక్ ద్వారా ఫోన్ నంబర్ కూడా నమోదు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. నంబర్ మారినా.. వెంటనే అప్డేట్ చేసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

