బస్టాప్‌లో బస్సులు ఆపడంలేదని గిరిజన మహిళలు జాతీయ రహదారిపై బుధవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు అమలు చేసినప్పటి నుంచి కండక్టర్ల్లు మదన్‌పల్లి పాతతండా బస్టాండ్ వద్ద బస్సులు ఆపడం లేదన్నారు. ఎందుకు ఆపడం లేదని కండక్టర్‌ను అడిగితే గతనెల ఓ గిరిజన మహిళపై కండక్టర్ చేయిచేసుకున్నారని వారు తెలిపారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి మదన్‌పల్లి పాతతండా వద్ద బస్సులు నిలిపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. – శంషాబాద్ రూరల్