గ్రేటర్లో 14 మంది ఐపీఎస్‌ల బదిలీ
నగరంలో 14 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడంతో పాటు పలువురికి పోస్టింగ్‌లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): నగరంలో 14 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడంతో పాటు పలువురికి పోస్టింగ్‌లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఎస్బీ అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పి.విశ్వప్రసాద్‌ను అక్కడి నుంచి బదిలీ చేసి, అదే కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ అదనపు సీపీగా పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న ఏవీ.రంగనాథ్‌కు నగర కమిషనరేట్‌లోని క్రైమ్స్, సిట్ జాయింట్ కమిషనర్‌గా పోస్టింగ్ కల్పించారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.విజయ్‌కుమార్‌ను అక్కడి నుంచి బదిలీ చేసి, వెస్ట్‌జోన్ డీసీపీగా పోస్టింగ్ కల్పించారు. వెస్ట్‌జోన్ డీసీపీగా ఉన్న జోయల్ డేవిస్‌ను అక్కడి నుంచి ఎస్బీకి బదిలీ చేశారు. మెదక్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న రోహిణీ ప్రియదర్శినిని నగరంలోని నార్త్‌జోన్ డీసీపీగా బదిలీ చేశారు. నార్త్‌జోన్ డీసీపీ చందనాదీప్తిని అక్కడి నుంచి బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
సిద్దిపేట పోలీసు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్.శ్వేతను అక్కడి నుంచి బదిలీ చేసి, నగర కమిషనరేట్‌లోని డీడీ డీసీపీగా పోస్టింగ్ కల్పించారు. వెయిటింగ్లో ఉన్న ఎ.సుబ్బరాయుడికి నగరంలో ట్రాఫిక్-1డీసీపీగా పోస్టింగ్ కల్పించారు. నగర టాస్క్‌ఫోర్స్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న నితిక పంత్‌ను అక్కడి నుంచి బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. నగర క్రైమ్స్, సిట్ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న గజారావు భూపాల్‌ను అక్కడి నుంచి బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. వెయిటింగ్లో ఉన్న ఎన్.వెంకటేశ్వర్లుకు హైదరాబాద్ ట్రాఫిక్-3 డీసీపీగా పోస్టింగ్ కల్పించారు. ట్రాఫిక్-3డీసీపీగా పనిచేస్తున్న డి.శ్రీనివాస్‌ను అక్కడి నుంచి బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్‌లోని రోడ్ సేఫ్టీ విభాగంలో డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీబాలా దేవిని అక్కడి నుంచి బదిలీ చేసి, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పోస్టింగ్ కల్పించారు. మాదాపూర్ డీసీపీ జి.సందీప్రావును అక్కడి నుంచి బదిలీ చేసి, రైల్వే అడ్మిన్ ఎస్పీగా పోస్టింగ్ కల్పించారు. రైల్వే అడ్మిన్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న జె.రాఘవేంద్రరావును అక్కడి నుంచి బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

