హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం.. ఆ తప్పులు చేస్తే భారీగా ఫైన్స్..!
News Traffic rules | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్ చేపట్టారు. రూల్స్ పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నల్స్
Traffice Rules | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్ చేపట్టారు. రూల్స్ పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సర్కిల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1000, పాదాచారులకు అడ్డు కలిగించేలా వాహనాలు నిలిపితే రూ.600 ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే భారీ ఫైన్స్ విధిస్తున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ రోప్’ విజయవంతం కావడంతో.. తాజాగా ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తూ రూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 ఫైన్ వేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి రాంగ్‌రూట్, ట్రిపుల్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ట్రాఫిక్ పోలీసులెవ్వరూ లేరు కదా అని ఇష్టానుసారంగా వాహనం నడిపినా.. ఎవరూ చూడడం లేదని నిబంధనలకు విరుద్ధంగా సిగ్నల్స్ జంప్ చేసినా సీసీ కెమెరాల్లో దృశ్యాలను బట్టి.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనల మేరకు వాహనాలను నడుపుతూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

