Hanuman Shobha Yatra | నేడు హనుమాన్ శోభాయాత్ర.. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు
Hanuman Shobha Yatra | ఈ నెల 6న హనుమాన్ జయంతి సందర్భంగా ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా ర్యాలీలు, కర్మన్‌ఘాట్ నుంచి గౌలిగూడ మీదుగా సికింద్రాబాద్ తాడ్బంద్ హనుమాన్ ఆలయం వరకు భారీ ర్యాలీ కొనసాగుతుంది.
Hanuman Shobha Yatra | సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 6న హనుమాన్ జయంతి సందర్భంగా ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా ర్యాలీలు, కర్మన్‌ఘాట్ నుంచి గౌలిగూడ మీదుగా సికింద్రాబాద్ తాడ్బంద్ హనుమాన్ ఆలయం వరకు భారీ ర్యాలీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ఉండేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలు సీవీ ఆనంద్, డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంధ్ర ఇప్పటికే ఆయా కమిషనరేట్ల పరిధిలో నిర్వహించే ర్యాలీలకు సంబంధించిన సమాచారం, ఆయా విభాగాలతో సమన్వయ సమావేశాలు, సిబ్బందితో పలుమార్లు సమావేశాలు నిర్వహించి బందోబస్తుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు. ర్యాలీలు జరిగే అన్ని రూట్లలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి
హైదరాబాద్‌లోని గౌలిగూడ నుంచి తాడ్బంద్ వరకు 12 కిలోమీటర్ల వరకు సాగే ర్యాలీకి సంబంధించిన రూట్ మ్యాప్‌ను ట్రాఫిక్ అదనపు కమిషనర్ సుధీర్‌బాబు విడుదల చేశారు. రూట్ మ్యాప్‌ను బుధవారం ఆయన ట్రాఫిక్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ర్యాలీ కొనసాగే రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ర్యాలీ సాఫీగా సాగేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలతో కలిసి రూట్‌ను పరిశీలించామని, ఎక్కడైన ఇబ్బందులుంటే ఆయా విభాగాలు వెంటనే పరిష్కరించాలని సూచించామని తెలిపారు. కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం వద్ద నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ చంపాపేట్ క్రాస్‌రోడ్స్, మలక్‌పేట్ ఏసీపీ కార్యాలయం, సరూర్‌నగర్ పోస్టాఫీస్, కొత్తపేట్ జంక్షన్, దిల్సుఖ్నగర్, నల్లగొండ క్రాస్‌రోడ్స్, కోఠి, కాచిగూడ క్రాస్‌రోడ్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్ క్రాస్‌రోడ్స్, గాంధీనగర్ జంక్షన్, కవాడిగూడ క్రాస్‌రోడ్స్, బైబిల్ హౌస్, బాటా, మహంకాళి ఆలయం, సీటీఓ జంక్షన్, బ్రూక్‌బాండ్ క్రాస్‌రోడ్స్, మస్తాన్ కేఫ్ నుంచి తాడ్బంద్ వీరాంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటుందని ఆయన వివరించారు. ప్రజలు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

