తెలంగాణ గతిని మార్చి.. ప్రగతి సిగలో మాణిక్యంలా నిలిపిన అనితర సాధ్యు డు.. అలుపెరుగని వీరుడు.. అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ పుట్టిన రోజును నేడు ఘనంగా నిర్వహించేందుకు నగరం సిద్ధమైంది. శుక్రవారం పలు చోట్ల సీఎం కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపట్టి.. జననేతకు పుట్టిన రోజు కానుక ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆలయాల్లో పూజలు, హోమాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు చేయనున్నారు. అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. గురువారం సైతం పలు కార్యక్రమాలు జరిగాయి. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఓయూలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఆవాల గింజలపై సీఎం కేసీఆర్ పేరును లిఖించి వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు అల్వాల్‌కు చెందిన సూక్ష్మ చిత్రకారుడు పూనా ప్రదీప్.
బేగంపేట్ ఫిబ్రవరి 16: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్డు పీవీ మార్గ్‌లోని సంజీవయ్య పార్కులో ఉన్న థ్రిల్ సిటీలో నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు మహమూద్‌అలీ, మల్లారెడ్డితో పాటు పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొంటారని తెలిపారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భారీ కేక్ కట్ చేస్తామని వెల్లడించారు.
వాల్‌పోస్టర్ ఆవిష్కరించిన వినోద్‌కుమార్
చిక్కడపల్లి, ఫిబ్రవరి 16: హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను గురువారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పి.నారాయణ, ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారత్నం, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు, విజయ్‌కుమార్, మారుతి ప్రసాద్, వీరేశం, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో సంబురాలు..
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణలో చీరలు పంపిణీ చేస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ, చిత్రంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్,దానం నాగేందర్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శ్రావణ్, కట్ట్టెల శ్రీనివాస్ యాదవ్ తదితరులు