RTC | ఆర్టీసీ ఇక డిజిటల్.. టికెట్ల కోసం చిల్లర తిప్పలు లేవు
RTC | ఇకపై ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కోసం చిల్లర వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మరికొన్ని రోజుల్లో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ఆర్టీసీ వేగవంతంగా తీసుకురాబోతుంది. ఇకపై ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు స్వైపింగ్ తదితర అన్నీ రకాల పేమెంట్స్ విధానాలతో టికెట్లు జారీ చేయనున్నారు.
- ఫోన్ పే, గూగుల్ పే, డెబిట్, క్రెడిట్ కార్డుతో బస్సుల్లోనే టికెట్లు జారీ
- విజయవంతంగా పూర్తయిన బండ్లగూడ పైలెట్ ప్రాజెక్ట్
- 70 మంది కండక్టర్లకు టికెట్ జారీ యంత్రాలు
- ఇకపై నగరమంతా డిజిటల్ సేవలు
సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ఇకపై ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కోసం చిల్లర వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మరికొన్ని రోజుల్లో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ఆర్టీసీ వేగవంతంగా తీసుకురాబోతుంది. ఇకపై ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు స్వైపింగ్ తదితర అన్నీ రకాల పేమెంట్స్ విధానాలతో టికెట్లు జారీ చేయనున్నారు. సాధారణంగా బస్సు టికెట్ల జారీలో చిల్లర బెడద కారణంగా కండక్టర్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించి టికెట్ జారీ చేయడానికి గ్రేటర్ ఆర్టీసీ అధికారులు చర్యలు మొదలెట్టారు.
అందులో భాగంగానే బండ్లగూడ డిపోను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 70 బస్సుల్లో టికెట్ జారీ యంత్రాలను కండక్టర్లకు అందజేశారు. 20 రోజుల నుంచి డిజిటల్ చెల్లింపులతోనే టికెట్లు జారీ చేశారు. ఆ యంత్రాల పనితీరులో ఏమైనా లోపాలున్నాయా? ఎంత సమయంలోపు పేమెంట్ అవుతుంది? స్కాన్ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయా? తదితర సాంకేతిక సమస్యలపై ఆర్టీసీ స్టడీ చేసింది. ఈ ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని తేలింది. దీంతో నగర వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను తీసుకురాబోతున్నారు.
అందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేశా రు. కాగా, గ్రేటర్లో 2841 బస్సులు ఉన్నాయి. వివిధ మార్గాల్లో 31,369 ట్రిప్పులు బస్సులు తిరుగుతాయి. ప్రతీ రోజు 20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. బస్సుల్లో ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియ తీసుకురాబోతుండటం పై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

