Tea Vending Machine | డబ్బులకు బదులు ఛాయ్, బిస్కెట్ ఇచ్చే ఏటీఎం.. తక్కువ పెట్టుబడితో మీరు ఈ మెషిన్‌ను సొంతం చేసుకోవచ్చు!
Tea Vending Machine | సాధారణంగా టీ స్టాల్ పెట్టాలంటే ఒకరిద్దరు మనుషులు, అంతకు మించి ఉండే పాత్రలు, సామగ్రి కావాలి. కానీ ఇవేవీ లేకుండానే ఏకంగా ఒక్క క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి టీ, కాఫీ, బిస్కట్‌తోపాటు, బాదం మిల్క్, లెమన్ టీ వంటివి ఇన్‌స్టాంట్‌గా కొనుగోలు చేయవచ్చు.
Tea Vending Machine | సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ): సాధారణంగా టీ స్టాల్ పెట్టాలంటే ఒకరిద్దరు మనుషులు, అంతకు మించి ఉండే పాత్రలు, సామగ్రి కావాలి. కానీ ఇవేవీ లేకుండానే ఏకంగా ఒక్క క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి టీ, కాఫీ, బిస్కట్‌తోపాటు, బాదం మిల్క్, లెమన్ టీ వంటివి ఇన్‌స్టాంట్‌గా కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్‌కు చెందిన జెమ్ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ సంస్థ… ఈ సరికొత్త వెండింగ్ మెషిన్‌ను ఆవిష్కరించి.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నది. గతంలోనూ ఈ సంస్థ గోల్డ్ ఏటీఎంలను రూపొందించింది.
కావాల్సిన ఐటెం కోసం..
ఈ వెండింగ్ మెషిన్లో టీ, కాఫీ, లెమన్ టీ, బాదం మిల్క్‌ను ఒక్కో ఐటమ్‌ను 150 కప్పులతో సర్వ్ చేసేంతగా, అలాగే 150 వాటర్ బాటిళ్లను లోడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు 150 బిస్కెట్ ప్యాకెట్లను స్టోర్ చేసుకునే సామర్థ్యం ఉండగా, కావాల్సిన ఐటమ్స్ కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వేడి వేడిగా సర్వ్ చేసేస్తుందీ యంత్రం. దీనికి నిర్వహణ ఖర్చు కూడా తక్కువే ఉండటంతో స్వయం ఉపాధి పొందేవారికి వీలుగా డిజైన్ చేశారు.
రూ.1.65 లక్షల పెట్టుబడితో..
ఇప్పటికే ఈ వెండింగ్ మెషిన్‌ను దళిత బంధు కార్యక్రమానికి ప్రభుత్వం ఎంపిక చేసింది. అలాగే తెలుగు రాష్ర్టాల ఆర్టీసీ యాజమాన్యాలు కూడా బస్టాండ్లలో వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేసేందుకు సదరు కంపెనీకి అవకాశమిచ్చాయి. రూ. 1.65 లక్షల పెట్టుబడితో స్వయం ఉపాధికి అవకాశం ఉండటంతో… ప్రారంభించిన ఒక నెల రోజుల్లో ఏకంగా 400 మంది రిటైల్ విక్రయాలు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.
మూడు నెలలకో కొత్త ప్రొడక్టు..
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీతో కూడిన వెండింగ్ మెషిన్లను ప్రతి మూడు నెలలకోసారి మార్కెట్లోకి తీసుకువస్తాం. ఇప్పటికే 6 ప్రొడక్టులకు పేటెంట్ రాగా, త్వరలో ఆటోమేటెడ్ క్లినిక్, టిఫిన్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నాం. వీటితోపాటు వెండింగ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను కూడా అభివృద్ధి చేస్తున్నాం.
– వినోద్‌కుమార్, జెమ్ ఓపెన్‌క్యూబ్ టెక్నాలజీస్ ఫౌండర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

