‘భువన్ సర్వే’పై అపోహలు వద్దు
నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ‘భువన్ సర్వే’ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ సర్వేపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని మేయర్ జక్కా వెంకట్ రెడ్డి సూచించారు.
- క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలి
- మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
- ఆస్తి పన్ను మదింపులో శాస్త్రీయత
- ఆదాయం పెంచుకునే అవకాశం
- మేయర్ జక్కా వెంకట్ రెడ్డి వెల్లడి
పీర్జాదిగూడ, జనవరి 21: నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ‘భువన్ సర్వే’ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ సర్వేపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని మేయర్ జక్కా వెంకట్ రెడ్డి సూచించారు. పీర్జాదిగూడ మున్సిపాలిటీ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం మేయర్ అధ్యక్షతన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు పారదర్శక పాలన, మెరుగైన సేవలు అందించాలన్న సంకల్పంతో నగరాలు, పట్టణాల్లో ఇంటి, పాట్ల పూర్తి సమాచారాన్ని జియో ట్యాంగింగ్ చేసే ప్రక్రియను ‘భువన్ సర్వే’ ద్వారా నిర్వహిస్తుందన్నారు.
ఈ ప్రక్రియలో అన్ని భవనాల సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసి, ఏ శ్లాబ్ కింద ఎంత పన్ను వసూలు చేయాలనేది నిర్ణయిస్తారన్నారు. ఆస్తి పన్ను మదింపులో శాస్త్రీయత పాటించకపోవడం, గృహ, వాణిజ్య కేటగిరీల నిర్ధ్దారణలో హేతబద్ధ్దీకరణ లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందన్నారు. ఎన్నో ఆస్తులు వాణిజ్య కేటగిరీలో ఉన్నా ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం రెసిడెన్షియల్ ఆస్తులుగా కొనసాగుతున్నాయన్నారు. మదింపులో శాస్త్రీయత పాటిస్తే పట్టణ ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్నారు. అయితే కొందరు లేనిపోని అపోహలను ప్రజల్లో సృష్టిస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు.
ఈ విషయాలను క్షేత్రస్థాయికి వెళ్లి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. భువన్ సర్వేతో ఒనగూరే ప్రయోజనాలను వివరించాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజలు ఆస్తి పన్ను చెల్లించే విషయంలో అనుమానాలు ఉంటే ప్రజలకు నేరుగా మున్సిపాలిటీ కార్యాలయం వచ్చి, సంబంధిత అధికారులతో సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలతో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) తీసిన ఉపగ్రహ ఛాయచిత్రాల సహకారంతో భవనాల సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తున్నామని తెలిపారు. ఇందులో భవనం ఏ కేటగిరిలోకి వస్తుంది, ప్రస్తుతం ఏ కేటగిరిలో ఉంది, భవనంలో జరుగుతున్న కార్యాకలాపాలు, నల్లా, విద్యుత్ కనెక్షన్లు, జీఎస్టీ, ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉన్నారా తదితర సమాచారాన్ని పొందుపర్చుతారని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆర్వో శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ జ్యోతి, శానిటరీ ఇన్స్పెక్టర్ జానకి, సీనియర్ అసిస్టెంట్ జగన్మోహన్, రెవెన్యూ, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, అకౌంట్స్, శానిటేషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

