అద్భుతమైన థీమ్ పార్కు థ్రిల్‌సిటీ

సిటీబ్యూరో, సెప్టెంబరు 11 (నమస్తే తెలంగాణ): సాగరతీరంలో అద్భుతమైన థీమ్ పార్కుగా థ్రిల్‌సిటీ గుర్తింపు పొందడం ఖాయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రాత్రి హుస్సేన్‌సాగర్ తీరంలోని పీ.వీ మార్గ్ (నెక్లెస్ రోడ్డు)లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రపంచ స్థాయి గేమింగ్, వినోద సౌకర్యాలతో కూడిన థ్రిల్ సిటీ థీమ్ పార్కును హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్‌లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిని అలరించేలా థ్రిల్ సిటీ థీమ్ పార్కును నిర్మించారన్నారు. థ్రిల్ సిటీ డైరెక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ థ్రిల్ సిటీలో ప్రధానంగా రైడింగ్ మాన్స్టర్ థియేటర్, స్లాస్ కోస్టర్, ఫ్లైయిట్ సిమ్యులేటర్, స్కోడా కారు డ్రైవర్, ట్రైనింగ్ సిమ్యులేటర్, క్రికెట్ సిమ్యులేటర్, బౌలింగ్ అల్లే, మ్యాజిక్ ట్రైయిన్, హర్స్ రంగుల రాట్నం ఇలా రకరకాల గేమింగ్స్ ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సుభాశ్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, హెచ్ఎండీఏ మాజీ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, థ్రిల్ సిటీ డైరెక్టర్ రజనీకాంత్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

