Crime | తండ్రిని చంపిన తనయుడు

కార్వాన్ : కొడుకు చేతిలో ఓ తండ్రి హత్యకు గురైన సంఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జి. సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తాళ్ళగడ్డ తాలీం అమ్లాపూర్ బస్తీలో నివపించే అలీ హుస్సేన్ ఖాన్ (65) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు. కాగా ఇతని పెద్ద కొడుకు అమ్జద్ అలీ ఖాన్ (35)కు తండ్రితో తరచు గొడవలు జరిగేవి.
ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి చిన్న కొడుకు, కోడలు మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో అలీ హుస్సేన్ ఖాన్ వారికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అయితే తండ్రి పై ద్వేషంతో ఉన్న పెద్ద కొడుకు అమ్జజ్ అలీ ఖాన్ ఈ గొడవను సాకుగా తీసుకొని సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో తండ్రి అలీ హుస్సేన్ ఖాన్ పై ఇనుపరాడుతో దాడి చేసి కాళ్ళు, తల పై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతరం తన తండ్రి కాలు జారి బాత్రూంలో పడడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లు తన బావ మఖ్బూల్కు సమాచారం అందించాడు. కాగా బాధితుడిని ఓ ప్రైవేటు దవాఖానాకు తరలించగా వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు మృతుడి రెండో కుమారుడిని ప్రశ్నించగా తన అన్న అమ్జద్ దాడి చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

