ఔషధాలకూ క్యూఆర్ కోడ్
మార్కెట్లో కొన్ని చోట్ల చలామణి అవుతున్న నకిలీ ఔషధాలకు చెక్ పెట్టేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) శ్రీకారం చుట్టింది.
- 300 రకాల మందులకు అమలు
- ఫార్మా కంపెనీలకు డీసీజీఐ ఆదేశాలు
సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): మార్కెట్లో కొన్ని చోట్ల చలామణి అవుతున్న నకిలీ ఔషధాలకు చెక్ పెట్టేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే సర్వసాధారణంగా ఎక్కువ మంది ప్రజలు వినియోగించే 300 రకాల బ్రాండెడ్ ఔషధాలపై ఇక నుంచి క్యూ ఆర్ కోడ్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల మనం కొనుగోలు చేసిన ఔషధాలు నిజమైనవా లేదా నకిలీవా తెలిసిపోతుంది. క్యూఆర్ కోడ్ వేయాల్సిన మందుల జాబితాల్లో డోలో, కాల్పాల్, షెల్కాల్, మెఫ్తాల్ తదితర ఔషధాలు కూడా ఉన్నట్లు డీసీజీఐ వెల్లడించింది. ఔషధాలపై క్యూ ఆర్ కోడ్ లేదా బార్కోడ్ వేయడంలో నిర్లక్ష్యం వహించే ఫార్మా కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని డీసీజీఐ తన ఆదేశాల్లో హెచ్చరించింది.
ఔషధం వివరాలతో పాటు..
క్యూ ఆర్ లేదా బార్ కోడ్ ద్వారా ఔషధానికి సంబంధించిన సాధారణ పేరు, బ్రాండ్ పేరు, తయారీ కంపెనీ పేరు, చిరునామా, బ్యాచ్ నంబర్ తయారీ తేదీ, గడువు తేదీ, లైసెన్స్ నంబర్ తదితర పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఒక్కసారి ఈ కోడ్ను స్కాన్ చేస్తే ఈ వివరాలన్నీ తెలిసిపోతాయి. ఈ నెల నుంచే బార్ కోడ్ విధానం అమల్లోకి రానున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

