Television Dancers , Dance Director Association | తెలుగు టెలివిజన్ డాన్సర్స్, డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రమాణస్వీకారం
రవీంద్రభారతి : తెలుగు టెలివిజన్, డిజిటల్ మీడియా,డాన్సర్స్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవం -ప్రమాణాస్వీకారోత్సవ కార్యక్రమం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణలు విచ్చేసి మాట్లాడు తూ తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా, డాన్సర్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు.
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ ఎంతో చేయూతనిస్తున్నారని అన్నారు. టెలివిజన్ కళాకారులకు ఆధుకునేందుకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సకాలు ఇవ్వనుందన్నారు. తెలంగాణలో తెలుగు సినిమాను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని ఆయన భరోసానిచ్చారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అసోసియేషన్ చైర్మన్గా సత్యం మాస్టారు, ప్రెసిడెంట్గా రమేష్ మాస్టారు, ప్రధాన కార్యదర్శిగా సతీష్ మాస్టారు, ట్రెజరర్గా తాజా మాస్టార్ను నూతన అసోసియేషన్ కార్యవర్గంగా ఎన్నుకున్నారు. అనంతరం ఫిలిం డాన్స్ మాస్టర్ డాక్టర్ కొప్పోజు మాధవ్మాస్టారు తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా, డాన్సర్ డాన్స్ అసోసియేషన్ సంస్థకు 50వేల రూపాయలను విరాళంగా అందజేశారు.గతంలో కూడా మాధవ్ ఫిలిం డాన్స్ యూనియన్ నూతన భవనానికి రూ.50వేల రూపాయల విరాళం అందజేశారు.
ఈ కార్యక్రమానికి తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబాల సురేష్కుమార్ సభకు అధ్యక్షత వహించారు.పలువురు బాల బాలికల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

