Cabinet meeting | తెలంగాణ కేబినెట్ భేటీ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానున్నది. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి రెండు డీఏలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పీఆర్సీ నివేదికతో పాటు ఉద్యోగుల పెండింగ్ డిమాండ్లపై చర్చ, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల ఇతర సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖరతాబాద్ ఉప ఎన్నికపై సైతం చర్చించనున్నట్లు తెలిసింది.
ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ
మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం
ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి రెండు డీఏలపై నిర్ణయం తీసుకునే అవకాశం
పీఆర్సీ నివేదికతో పాటు ఉద్యోగుల పెండింగ్ డిమాండ్లపై చర్చ
పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల ఇతర… pic.twitter.com/gL63inhWoV
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2026