GHMC | శుష్క ప్రియాలు శూన్య హస్తాలు.. హైదరాబాద్ అభివృద్ధికి 6వేల కోట్లు అడిగితే 3వేల కోట్లు ఇచ్చారు
తెలంగాణకు ఐకాన్‌గా మారిన హైదరాబాద్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని బడ్జెట్ ప్రసంగంలో గొప్పగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తీరా కేటాయింపులకు వచ్చేసరికి మాత్రం చతికిలబడిపోయింది. శరవేగంగా మారుతున్న నగర పురోభివృద్ధికి బల్దియా 6వేల కోట్ల రూపాయలు అవసరమని అడిగితే 3వేల కోట్లు మాత్రమే ప్రకటించింది.
GHMC | సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు ఐకాన్‌గా మారిన హైదరాబాద్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని బడ్జెట్ ప్రసంగంలో గొప్పగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తీరా కేటాయింపులకు వచ్చేసరికి మాత్రం చతికిలబడిపోయింది. శరవేగంగా మారుతున్న నగర పురోభివృద్ధికి బల్దియా 6వేల కోట్ల రూపాయలు అవసరమని అడిగితే 3వేల కోట్లు మాత్రమే ప్రకటించింది.
హెచ్-సిటీకి నిధులపై స్పష్టతేదీ?
హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి పేరిట కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీ పథకాల స్థానంలో కాంగ్రెస్ సర్కారు హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)కి రూపకల్పన చేసింది. కానీ ఆచరణలో మాత్రం అందుకు తగ్గట్లుగా నిధుల కేటాయింపులు జరపలేదు. కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ రవాణా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి శర వేగంతో 36 ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను చేపట్టి చాలా ప్రాంతాల్లో సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేసింది. ఏటా రూ.600-700కోట్ల మేర నిధులను ఖర్చు చేసి ఫ్లై ఓవర్లు, ఆర్వోబీ, ఆర్‌యూబీలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
దీంతో పాటు వరద నీటికి శాశ్వత పరిష్కారంగా ఎస్ఎన్డీపీ పథకాన్ని తీసుకువచ్చి రూ. 985.45కోట్లతో చేపట్టిన మొదటి విడత పనులు రూ.592. 68కోట్లు ఖర్చు పెట్టి 39 చోట్ల పనులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేసింది. గుంతలు లేని రహదారులే లక్ష్యంగా సీఆర్ఎంపీ పథకాన్ని రూ. 900కోట్లతో చేపట్టి ఆదర్శవంతమైన పథకంగా మార్చింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఈ పథకాల స్థానంలో హెచ్ సిటీ ప్రాజెక్టుగా ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్న రవాణా వ్యవస్థ, మౌలిక వసతుల కల్పనకుగానూ హెచ్ సిటీ కింద కేవలం రూ.2675.35 కోట్లు మాత్రమే కేటాయించింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీకి రూ.7వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి.. ఈ అప్పులకు సర్కారు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. మొత్తంగా సర్కారుకు రూ. 6వేల కోట్ల ప్రతిపాదనలు పంపిస్తే ..ప్రభుత్వం మాత్రం 3,075.7 కోట్లు మాత్రమే కేటాయించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

