వ్యాపారంపై ఆసక్తిని పెంచేలా..
యువతరంలో వ్యాపారంపై ఆసక్తిని పెంపొందించేలా టీ హబ్ ఎదుట గురువారం రోడ్ షో నిర్వహించారు. టీ హబ్‌లో స్టార్టప్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డెనార్లెన్ సంస్థ ప్రత్యేకమైన రోడ్ షోను నిర్వహించింది.
- డెనార్లెన్ సంస్థ ఆధ్వర్యంలో వినూత్న తరహాలో రోడ్ షో
సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): యువతరంలో వ్యాపారంపై ఆసక్తిని పెంపొందించేలా టీ హబ్ ఎదుట గురువారం రోడ్ షో నిర్వహించారు. టీ హబ్‌లో స్టార్టప్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డెనార్లెన్ సంస్థ ప్రత్యేకమైన రోడ్ షోను నిర్వహించింది. మొట్ట మొదటి గేమీఫైడ్ సోషల్ మీడియా సంస్థగా డెనార్లెన్ వినూత్నంగా 3సీ( క్రియేట్, కొలాబరేట్, కాంకర్) ప్రదర్శనను నిర్వహించింది. అనురాగ్ యూనివర్సిటీకి చెందిన 60 మంది విద్యార్థులు ఒకే రంగు టీ షర్టులు ధరించి రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ ఫ్లాష్ మాబ్ చేశారు.
అనంతరం పది గుర్రాలతో ప్రదర్శన చేపట్టారు. ప్రేక్షకులను ఆహ్లాదపరిచేలా గుర్రాలతో రోడ్డుపై పరుగులు తీయించారు. అనంతరం 15 స్పోర్ట్స్ బైక్‌లతో ర్యాలీగా రోడ్లపై రైడ్ నిర్వహించారు. వీటితో పాటు జీటీ హైదరాబాద్ సభ్యులు 15కు పైగా ప్రీమియం లగ్జరీ కార్లతో ప్రదర్శన చేశారు. నేటి యువతరం పెద్ద కలలు కనాలని, వారిలోని అభిరుచిని వ్యాపారంగా మార్చుకోవాలని లక్ష్యంతోనే ఈ ప్రత్యేక రోడ్ షోను టీ హబ్ ఎదుట నిర్వహించామని నిర్వాహకులు స్టార్టప్ డెనార్లెన్ సీఈఓ ఠాగూర్ తెలిపారు. యువత చదువు తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఉద్యోగావకాశాలు కల్పించే ఔత్సాహిక వ్యాపార వేత్తలుగా ఎదగాలన్నదే తమ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

