పేద విద్యార్థ్ధులకు సహకారం అందించాలన్న లక్ష్యంతో స్ట్రీట్కాస్ స్వచ్ఛంద సంస్థ, పల్లవి ఫౌండేషన్, మై ఫిట్నెస్ సంస్థల సంయుక్తాధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో ఆదివారం ఆర్ఎఫ్సీ 10 పేరుతో నిర్వహించిన 5కేరన్ ఉత్సాహంగా సాగింది.
అంతకుముందు స్ట్రీట్కాస్ సీఈవో శృతి, అధ్యక్షురాలు సాహితీతో కలిసి ఈ రన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు, నటీనటులు నవదీప్, వైష్ణవి చైతన్య విద్యార్థులను ఉత్సాహపరిచారు.
-ఖైరతాబాద్, మార్చి 31